పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పది, ఇంటర్ ఓపెన్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నారు. పరీక్షల నిర్వహణపై ఐడిఓసి కార్యాలయంలో సోమవారం విద్య రెవెన్యూ పోలీస్ వైద్య రవాణా విద్యుత్ మిషన్ భగీరథ పంచాయితీ మున్సిపల్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓపెన్ పరీక్ష నిర్వహణకు 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 1912 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుండి మే నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగునున్నట్లు తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని తాసిల్దార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోనికి, విద్యార్థులు కానీ విధులు నిర్వహించే సిబ్బంది గానీ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు వెళ్ళడానికి అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాలలో అత్యవసర సేవలు నిర్వహణకు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని చల్లని సురక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలని విద్యుత్ అంతరం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిఆర్ఓ అశోక చక్రవర్తి, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు,  జిల్లా వైద్యాధికారి శిరీష , ఆర్టీవో వేణు , విద్యుత్ శాఖ డీఈ వెంకటరత్నం  తదితరులు పాల్గొన్నారు