కోనేరు చిన్ని బీజేపీకి  గుడ్ బై .... బీఆర్ యస్ లో చేరికకు రంగం సిద్ధం ...

కోనేరు చిన్ని బీజేపీకి  గుడ్ బై .... బీఆర్ యస్ లో చేరికకు రంగం సిద్ధం ...
  • సీఎం కేసీఆర్ తో  భేటీ ...ఆయన భవిష్యత్ కు  అభయం 
  • కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీచేస్తున్నారనే నేపథ్యంలో కీలక నేతలకు గాలం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఫోకస్ ...

(ముద్ర ప్రత్యేక ప్రతినిధి ): కొత్తగూడెం కు చెందిన మాజీమంత్రి దివంగత కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ బీజేపీ కి గుడ్ బై చెప్పనున్నారు . నేడో  రేపో బీఆర్ యస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది ..ఈ మేరకు ఆయన బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ తో గతరాత్రి పొద్దుపోయిన తర్వాత భేటీ అయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం ... గతంలో కొత్తగూడెం నుంచి  ఆయన  టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు నియోజకార్గంపై మంచి పట్టు ఉంది. డైనమిక్ లీడర్ గా  పేరు అనుచరగణం ఉన్నారు . గత ఎన్నికల తరువాత ఆయన బీజేపీలో చేరారు . ప్రస్తుతం బీజేపీ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు . చిన్నికి బలమైన సామజిక వర్గానికి చెందినవారు కావడం మంచితనం బీఆర్ యస్ కు అదనపు బలం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు... ఆయనకు కొత్తగూడెం లోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాపితంగా మంచి సంబంధాలు ,బందుగణం ఉంది . అందరికి కలుపుకుని పోయే మనస్తత్వం, మంచి నాయకుడిగా పేరు ఉండంతో కేసీఆర్ ద్రుష్టి  ఆయనపై పడింది. దీంతో ఆపరేషన్ లో భాగంగా నేరుగా హైద్రాబాద్  నుంచే ఆయన్ను ప్రగతి భవనం కు పిలిపించుకొని చర్చలు జరిపారు . ఆయన భవిష్యత్ కు కేసీఆర్ హామీ ఇచ్చారు.

మంచి పొజిషన్ లో ఉండే విధంగా చేస్తామని చెప్పారు. నిత్యం వనమా కుటంబంతో  కొత్తగూడెంలో కోనేరు  కుటంబానికి విభేదాలు ఉండేవి... ఇప్పుడు  చిన్ని బీఆర్ లో చేరనున్నడటంతో వారి మధ్య సఖ్యత ఏర్పడి కొత్తగూడెం నుంచి ప్రత్యర్థులు ఎవరైనా బీఆర్ యస్ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే రిపోర్టులు , నిఘా వర్గాల నివేదికలు  కొత్తగూడం నియోజకవర్గానికే కాక ఉమ్మడి జిల్లాలో ఆయన ప్రభావం పై   సమాచారం అందించాయి.. నిన్న బీఆర్ యస్ అభ్యర్థులు జాబితా విడుదల వివిధ నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూనే కోనేరు చిన్నితో సీఎం కేసీఆర్ భేటీ కావడం అంతే ఆయన ప్రాధాన్యత తెలియచెప్పుతుంది.

చిన్న చేరిక  ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కు అదనపు బలం జిల్లాలో ఆయన సామాజికవర్గం గణనీయంగా ఉంది. ఆయనకు ఎంపీ నామ నాగేశ్వరరావు మంచి సంబంధాలు ఉన్నాయి. జిల్లాలో ఆయన సేవలు  ఉపయోగించుకోవాలని కేసీఆర్ భవించడం అందుకు అనుగుణంగా ఆయనతో మాట్లాడం అన్ని అత్యంత రహస్యంగా జరిగాయి. నేడు  ఆయన మీడియా  సమావేశంలో తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది....