Puttapadu forest area పుట్టపాడు అడవుల్లో... తూటాల మోత

Puttapadu forest area పుట్టపాడు అడవుల్లో... తూటాల మోత

ఇద్దరు మావోయిస్టు లు మృతి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పుట్టపాడు అడవుల్లో ఆదివారం వేకువజామున తూటాల మోత మోగింది. ఈ ఘటనతో పచ్చని అడవుల్లో నెత్తుర్లు పారాయి.  నిషేధిత సీపీఐ మావోయిస్టు లు, పోలీసులకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు చెందిన యాక్షన్ టీం సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా పుట్టపాడు  అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈకాల్పుల్లో చర్ల ఏరియా ఎల్ వో ఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య అలియాస్ రాజేష్, తో పాటు మరో దళ సభ్యుడు మృతి చెందాడు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక SLR ఆయుధం, ఒక సింగల్ బోర్ తుపాకీ మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.