విద్యార్థులూ... మీ అందరికీ అభినందనలు: జిల్లా కలెక్టర్ అనుదీప్

విద్యార్థులూ... మీ అందరికీ అభినందనలు: జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి విద్యార్థులు మీకు అభినందనలు అంటూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం 10 వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపారు. సంవత్సర కాలం పాటు ఎంతో కృషి,  పట్టుదలతో 10 తరగతి  పరీక్షలకు సన్నద్ధమయ్యారని,  విద్యార్థి దశకు ఎంతో కీలకమైనటువంటి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆశీర్వదించారు.  ఎలాంటి వత్తిడి,  ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.  

పరీక్ష రాసేనందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు..  పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి అదనపు బస్సులు ఏర్పాటు చేశామన్నారు.  పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యార్థులతో పాటు పర్యవేక్షణ అధికారులకు కూడా అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.  పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ప్రశాంత వాతావరణం  ఉండేవిధంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.  అత్యవసర వైద్య కేంద్రాలు,  సురక్షిత మంచినీరు,  నిరంతర విద్యుత్ సరఫరా తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని,  మీరందరూ ఎలాంటి అక్రమాలకు, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా నిశ్చింతగా పరీక్షలు రాసి మంచి గ్రేడింగ్ తో  ఉత్తీర్ణత సాధించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.