రేపటి నుంచి కొండగట్టులో చిన్న జయంతి

రేపటి నుంచి కొండగట్టులో చిన్న జయంతి

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4 నుంచి 7 వరకు జరగబోయే జయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షపరులు లక్షలాదిగా తరలివస్తారు.. 11, 21 రోజులు దీక్ష స్వీకరించిన స్వాములు ఉత్సవాల్లో మాల విరమణ చేస్తారు. భక్తులకు ఎక్కడాకూడా ఇబ్బందులు తలేత్తకుండా ఈసారి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ప్రత్యేక చొరవ తీసుకోని, మొత్తం జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. దాదాపు అన్ని మండలాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఎప్పుడు జరగని విధంగా సమీక్షా సమావేశం నిర్వహించి, జయంతి సక్సెస్ కు ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. జయంతి రోజుల్లో సంబంధిత అధికారులు జిల్లా హెడ్క్వార్టరును వదిలి వెళ్లకుండా, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

 విధుల కేటాయిoపు...
చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్బంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మల్యాల తహసీల్దార్ సుజాతకు సాన అతిధి గృహం వద్ద ప్రోటోకాల్ పాటించడానికి, మల్యాల, కొడిమ్యాల ఎంపీడీఓ లు పద్మజ, వెంకటేశo, ఎంపీవో లు ప్రవీణ్, వాసవిలకు భక్తులకు త్రాగునీటి వసతి కల్పించడానికి, అలాగే ఎంపీవోలకు అదనంగా శానిటేషన్ బాధ్యతలు, బుగ్గారాం తిరుపతికి ప్రధాన క్యూలైన్ వద్ద, గొల్లపల్లి ఎంపీడీఓ నవీన్ కుమార్ కు కోనేరు, ఎంపీవో సురేష్ రెడ్డికి పాత కోనేరు వద్ద మరుగుదొడ్ల వద్ద ఏర్పాట్లు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ ప్రభుకి అన్నదానం, జగిత్యాల ఎంపీడీఓ రాజేశ్వరికి దీక్ష మండపం వద్ద, జగిత్యాల గ్రామీణ ఎంపీవో రవిబాబుకి ఈవో కార్యాలయం, ధర్మదర్శన ప్రాంతం, కథలాపూర్ ఎంపీడీఓ జనార్దన్ కు భేతాళస్వామి

ఆలయం వద్ద, బిర్పూర్ ఎంపీవో రామకృష్ణ రాజ్ కి పార్కింగ్ ప్రాంతం, మల్యాల వైద్యాధికారి, ధర్మపురి ఎంపీవో నరేష్ కుమార్ కు 24 గంటల ఆరోగ్య కేంద్రల నిర్వహణ, కథలాపూర్ ఎంపీవో గంగాధర్ కి వాలింటర్ల ఏర్పాటు, మల్లాపూర్ ఎంపీడీఓ రాజశ్రీనివాస్ కి ప్రజా ప్రచార వ్యవస్థ, వెల్గటూర్ ఎంపీవో శ్రీనివాస్ కి ఆర్టీసీ బస్సుల రవాణా, కోరుట్ల ఎంపీవో నీరజకు విద్యుత్ సరఫరా, మేడిపల్లి ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ కి అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ ఏర్పాటు, కొండగట్టు ఈవో వెంకటేష్, కొడిమ్యాల తహసీల్దార్ స్వర్ణ, కోరుట్ల ఎంపీడీఓ నీరజలకు కొండపైన 'రూట్ మ్యాప్' ఏర్పాట్లు, మెట్టుపల్లి ఎంపీడీఓ భీమేష్ కు బందోబస్త్ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

 ఏర్పాట్లలో నిమగ్నం...
చిన్న జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు కొండపైన, కింద అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు కొండపైకి చేరుకొని, సౌకర్యాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు భద్రత పరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.