ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ అన్నారు.గవర్నర్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా
భద్రాచలం వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో ఆమె ముఖాముఖీ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ-     
ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధ  పడుతున్నానని చెప్పారు. 

అంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని  గిరిజనులు కోరగా గవర్నర్ ఇట్టి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు  తీసుకుంటానని హామీ ఇచ్చారు.  తెలుగులో అందరూ బావున్నారా, అందరూ బావుండాలని సీతారామ చంద్రస్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.  తాను తమిళ ఆడబిడ్డనైనా   తెలంగాణ ప్రజలకు అక్కనని 
ఇక్కడి సమస్యలను అర్దం చేసుకున్నాను అని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని అన్నారు.  

ఆదివాసీలు సమస్య పరిష్కార  బాధ్యతలు అప్పగించారని, తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తొలుత భద్రాద్రి సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు  పూర్ణ కుంభం తో ఘనంగా స్వాగతం పలికి గర్భ గుడిలో పూజలు నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్, వినీత్ జి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య లు స్వాగతం పలికారు.