ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈనెల 14వ తేదీన జిల్లా నుండి వెళ్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. హైదరాబాద్ వెళ్లే ప్రజలకు అల్పాహారం భోజనం ఏర్పాట్లు పై మంగళవారం కలెక్టరేట్  నుండి రెవెన్యూ, పంచాయతీరాజ్ , ఉపాధి కల్పన పరిశ్రమలు , మున్సిపల్ కమిషనర్లు , ఆర్టీసీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులు 13వ తేదీ రాత్రి నియోజకవర్గ తహసిల్దార్ కార్యాలయమునకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను డిపిఓ, జడ్పీ సీఈవో పర్యవేక్షణ చేయాలన్నారు.

బస్సులో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించేందుకు  అందించేందుకు ఇద్దరు జిల్లా అధికారులను ఇద్దరు తాసిల్దార్లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు . ప్రయాణంలో ప్రజలకు మంచినీరు,  మజ్జిగ ,స్నాక్స్ ను ఏర్పాటు చేయాలన్నారు .  నార్కెట్పల్లి  శబరి గార్డెన్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఉపాధి కల్పనాధికారి విజేత పరిశ్రమల అధికారి సీతారాం తాసిల్దార్లు సునీల్ రెడ్డి నాగరాజుకు భోజన ఏర్పాట్ల బాధ్యత అప్పగించినట్లు తెలిపారు . అధికారులు ఒకరోజు ముందుగానే శబరి గార్డెన్ చేరుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.  వేసవికాలం దృష్టిలో ఉంచుకొని బస్సులలో అత్యవసరమందులను అందుబాటులో ఉంచడంతోపాటు శబరి గార్డెన్లో అత్యవసర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు.  హైదరాబాద్ వెళుతున్న వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.  టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ,డిపిఓ రమాకాంత్,  జెడ్పి సీఈవో విద్యాలత , ఉపాధి కల్పనాధికారి విజేత , పరిశ్రమ శాఖ జీఎం సీతారాం,  డిఆర్ఓ అశోక చక్రవర్తి , ఆర్టీసీ డిఎం భవాని ప్రసాద్,  కొత్తగూడెం భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత , రత్న కళ్యాణి , తహసిల్దార్లు , ఎంపీడీవోలు పాల్గొన్నారు.