డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుకావు డబ్బా ఇండ్లు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుకావు డబ్బా ఇండ్లు
  • ఇండ్లు పూర్తికాకుండానే లబ్ధిదారుల ఎంపిక
  • నాశరకంగా ఇండ్ల నిర్మాణం
  • సిపిఎం నేతలు కాసాని, అన్నవరపు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెంలో నాసికంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డబ్బా ఇండ్ల లాగా ఉన్నాయని సిపిఎం సీనియర్ నాయకులు కాషాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి కనకయ్య విమర్శించారు. సోమవారం సిపిఎం బృందం కొత్తగూడెం లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం పూర్తికాకుండానే డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కే దక్కుతుందన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు సైతం నాసిరకంగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగకపోవడం వలన అసలైన అర్హులకు అన్యాయం జరిగిందని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్ల కనుసన్నులలోనే లబ్ధిదారుల ఎంపిక జరగడం దారుణం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో చేతివాటం ప్రదర్శించిన కౌన్సిలర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన అవినీతికి స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కేంతవరకు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేష్ ,వీరన్న, లక్ష్మి, వీరభద్రం, జును మాల వంశీ తదితరులు పాల్గొన్నారు