క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయి జిల్లా ఎస్పీ వినీత్ జి

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయి  జిల్లా ఎస్పీ వినీత్ జి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా ఎస్పీ వినీత్ జి అన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం లో  బుధవారం  ఘనంగా డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బందిని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు,వ్యాయామం ఒక భాగంగా ఉండాలని,ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఎదో ఒక వ్యాయామం గానీ, క్రీడను గానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

క్రీడలలో గెలుపోటములు సాధారణమని,క్రీడా స్పూర్తితో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడే జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కోగలమని అన్నారు. క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ పతాకాన్ని  క్రీడాకారులు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,డిఎస్పీలు రెహమాన్,వెంకటేష్,రాఘవేంద్రరావు,రమణమూర్తి  ఆర్ఐలు,సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.