లక్ష్మీనరసింహస్వామి స్వామి ఆశీస్సులతో.... ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా

లక్ష్మీనరసింహస్వామి స్వామి ఆశీస్సులతో.... ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • వాన కొండయ్య జాతరలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జనగామ : వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరప్పుల మండలంలో ప్రారంభమైన వాన కొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ శివలింగయ్య తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా కడవెండిలో మగ్గం నేసి ఆ వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. హోలీ పండుగ రోజు ప్రారంభమైన ఈ జాతర ఉగాది వరకు సాగుతుంది. కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులతో మంత్రి కోలాటం ఆడుతూ, చిడతలు వాయిస్తూ, డప్పు డప్పు కొట్టి దరువేసి భక్తులలో ఉత్సాహం నింపాడు. స్వామివారి కల్యాణానికి మంత్రి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావుకు, జిల్లా కలెక్టర్ శివలింగయ్య లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ  ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు వానకొండయ్య జాతర కు ప్రాశస్త్యం వుంది, చారిత్రాత్మకమైనది హోళీ పండుగ నాడు ప్రారంభం అయ్యి ఉగాది వరకు జాతర సాగుతుందన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే, మంత్రిని అయిన సీఎం కెసిఆర్ నేతృత్వంలో మన ప్రాంతంలో ఆలయాలను అభివృద్ది చేస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గాన్ని నభూతో నభవిష్యత్ అనేలా అభివృద్ది చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.