ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ జి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సోమవారం చర్ల మండలం పూసగొప్ప అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు పార్టీ ఛత్తీస్గడ్ రాష్ట్రం ఉషూర్ ఎల్ వో ఎస్ డిప్యూటీ కమాండర్ మడివి ఇడుమ దళ సభ్యురాలు కుంజ దేవిలను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు ఆదివాసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.