మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి అనుచరనీయం

మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి అనుచరనీయం
  •  పేద వాడి ఆకలిని గుర్తించేందుకే ఫిత్రా, జకార్తా
  •  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మహ్మద్ ప్రవక్త భోదనలు ప్రపంచ మానవాళికి అనుచరణీయమని, ప్రతి ఒక్కరు మమ్మద్ ప్రవక్త చూపిన శాంతిమార్గంలో పయనించి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం బోడగుట్ట, రామవరంలోని ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న అనంతరం ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోడగుట్ట ఈద్గా వద్ద ముస్లిం సోదరులను ఉద్దేశించి  కూనంనేని మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలు ఆచరించే ఫిత్రా, జకార్త్ వంటి నియమాలు పేద వాడి ఆకలిని, శ్రమను గుర్తించే ఏర్పాటు చేసుకున్నవేనని, తన సంపాదనలో కొంతభాగాన్ని పేదల ఆకలితీర్చేందుకు కేటాయించడం మహోన్నతమైందన్నారు.

పండుగలు, ఉత్సవాలు మతసామరస్యంతోపాటు ప్రజల్లో ఐఖ్యతను పెంపొందిస్తాయని, భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు ముస్లీం కుటుంబాలు అన్ని ప్రజలను పండుగలో భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. పేద ముస్లీంలు కూడా పండుగను ఆనందంగా జరుపుకునేందుకు తమవంతు సహాయ, సహకారాలు అందించేందుకు ముందుకురావడం హర్షణీయమన్నారు. కార్యక్రమాలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ముస్లిం మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయిం ఖురేషి, ముస్లీం పెద్దలు అహ్మద్ జుబేర్ అహ్మద్, ఆబిద్ హుస్సేన్, ఇస్మాయిల్, అమీర్, గాజి సలావుద్దీన్, యాకుబ్ ఖాద్రి, అహ్మద్, ఇర్ఫాన్, సిపిఐ జిల్లా నాయకులు వై.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.