పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నీటి వినియోగం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై ఎపి మాస్, మెప్మా సంయుక్తంగా నిర్వహించిన రెండవ రోజు వర్క్ షాప్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ నీటి వినియోగం, పారిశుద్ధ్యము అంశాలపై  మహిళ అభివృద్ధి  సొసైటీమ, మహిళా సంఘాలకు అవగాహన కల్పించడం హర్షనీయమని అన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను  మహిళా సభ్యులకు తెలియజేస్తూ, వారికి నీటి వినియోగము, పరిశుభ్రతపై మెప్మా ఆర్పీల కృషిని అభినందించారు. ఎపి మాస్ ప్రతినిధి బ్రహ్మచారి నీటి వినియోగం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రతి ఒకరు నీటిని వృధా చేయకుండా ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉన్న సౌచాలయమును పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సౌచాలయము నిర్మాణము మరమ్మత్తులకు, ఇతర త్రాగునీటి సౌకర్యం కోసం ఎపి మాస్ సంస్థ నుండి రుణాలు ఇప్పిస్తామని ఆ రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చని రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ రాజేశ్వర్,   ఎఓ శ్రీనివాస్ గౌడ్, మెప్మా డిఎంసి సునీత, టిఎంసి రజిత, సిఓలు రాధా, నాగరాణి ,మెప్మా రిసోర్స్ పర్సన్ లో పాల్గొన్నారు.