ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసమే మీరు నేను కార్యక్రమం. ఎమ్మెల్యే డా.సంజయ్

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసమే మీరు నేను కార్యక్రమం. ఎమ్మెల్యే డా.సంజయ్

బీర్పూర్,ముద్ర: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మీరు నేను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.బీర్ పూర్ మండల మంగెల, కమ్ము నూరు గ్రామంలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా  మంగెల గ్రామంలో పల్లె నిద్ర చేసి,ఉదయాన్నే వార్డులను పర్యటించారు.ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలిస్తూ గ్రామంలో ప్రజల సమస్యలను పరిష్కరించారు.అంతకు ముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు తిలకం దిద్ది,బతుకమ్మ లతో  మహిళలు స్వాగతం పలికారు.

మంగెల గ్రామంలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మీరు నేను కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని చిన్న చిన్న సమస్యలను అధికారుల ద్వారా వెంటనే పరిష్కరించి ఇంకా ఏమైనా  సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం ద్వారా పరిష్కారం చూపడానికి మీరు నేను కార్యక్రమం చేపట్టి పల్లెనిద్ర చేస్తున్నానని అన్నారు.

మీరు నేను కార్యక్రమంలో భాగంగా ప్రజలకు భారతీయ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా తెలియజేసే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోలుముల రమణ, మాజీ జెడ్పిటిసి ముక్క శంకర్, సర్పంచులు శారద నరేందర్, మరియా రాజేశం ,ఉప సర్పంచ్లు వెంకటేష్, తోట అంజన్న, మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్,, ఉపాధ్యక్షులు గంగాధర్, శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మెరుగు రాజేశం, గ్రామ శాఖ అధ్యక్షులు రాస శంకర్, తోటరామయ్య, మండల యూత్ అధ్యక్షులు రామచంద్రమ్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ పొలాస వినోద్ ,నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు