కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నియామకం పట్ల సంబరాలు 

కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నియామకం పట్ల సంబరాలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిజేపి  రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర పర్యటక శాఖ గంగాపురం కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ గా  ఈటల రాజేందర్ నియామకం పట్ల  జగిత్యాల బిజెపి పట్టణ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచి  సంబరాలు నిర్వహించారు.  సందర్భంగా స్థానిక తహశీల్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణి చేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ నిబద్దత సమర్థవంతమైన నాయకుడు కిషన్ రెడ్డి అని అధిష్టానం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు. 

కిషన్ రెడ్డి 1977 నుండి ఇప్పటివరకు  పార్టీకి ఎంతో కృషి చేశారని, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసినటువంటి అనుభవం కిషన్ రెడ్డి గారికి ఉందన్నారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజేపి తెలంగాణలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎసిఎస్ రాజు, కౌన్సిలర్ గుర్రం రాము , చీటి శేఖర్ రావు, కిషోర్ సింగ్, లక్ష్మారెడ్డి, బడే శంకర్, బిక్షపతి, నారాయణరెడ్డి, గొరికర్ భరత్, పొలస సత్తి, నవ్వోతు సురేష్ ,కోల రాజకుమార్, శ్రీరాములు, బిట్టు, కూర్మచలం సతీష్, మహేందర్, సంపత్ రావు, మహేష్ , వికాస్ రావు, సాయి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.