జిల్లా సమస్యలను పట్టించుకోని మంత్రి కొప్పుల ఈశ్వర్

జిల్లా సమస్యలను పట్టించుకోని మంత్రి కొప్పుల ఈశ్వర్

బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే ఉన్న జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్టించుకోక పోవడం భాధకరమని బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం బిఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా లింబాద్రి మాట్లాడుతూ తరగు పేరుతో మిల్లర్లు రైతులను దోపిడికి గురి చేస్తున్న పట్టించుకున్న  నాదుడేలేడన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలో ఇతనాల్ ఫ్యాక్టరీని సొంత లాభం కొరకు  వేస్తున్నారని, ప్రభుత్వ భూములలో గురుకుల భవనాలు, వంద పడకల ఆస్పత్రి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గంలో కాలేశ్వరం ప్రాజెక్టు కింద భూముల కోల్పోయిన వారికి నష్టపరిహారం సరిగా ఇవ్వడం లేదని, మంత్రి పట్టించుకోకపోవడం భాధాకరం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మద్దెల నారాయణ, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయ్, కోరుట్ల ధర్మపురి నియోజకవర్గాల అధ్యక్షుడు గురు మంత్రుల ప్రభాకర్, శ్రీనివాస్ పెళ్లి శ్రీధర్, రామ్పళ్లి, బాలరాజు, అరవింద్, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.