మంత్రి హరీష్ రావు ను కల్సి కృతజ్ఞతలు తెలిపిన  వి ఆర్ ఏ లు 

మంత్రి హరీష్ రావు ను కల్సి కృతజ్ఞతలు తెలిపిన  వి ఆర్ ఏ లు 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: వి ఆర్ ఏ లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా వి ఆర్ ఏ లు మంత్రి హరీష్ రావు ను సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శనవారం నాడు కల్సి కృతజ్ఞతలు తెలిపారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటామని వారు అన్నారు వారు అన్నారు. వి ఆర్ ఏ లను గుర్తించిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ సర్కారేనని వారు కొనియాడారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు.