క్యాండిల్ ర్యాలీ

క్యాండిల్ ర్యాలీ

కేసముద్రం, ముద్ర: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేసముద్రం ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో శుక్రవారం రాత్రి క్యాండిల్ వెలిగించి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ రమేష్ మాట్లాడుతూ యవ్వన దశలో సంభవించే ఆరోగ్యపరమైన మార్పులు గురించి వివరించారు.

అలాగే గుడ్ టచ్ బ్యాడ్ బ్యాడ్ టచ్ గురించి వివరించి, భవిష్యత్తులో హెచ్ఐవిని రూపం మాపడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే హెచ్ఐవి బాధితుల పట్ల అందరూ కూడా సేవా భావంతో మెలగాలని, వారి హక్కుల్ని కాపాడాలని, వారి పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినట్టు తెలిస్తే హెచ్ఐవి, ఎయిడ్స్ చట్టం -2017 ప్రకారం వారి పైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమాదేవి, సరోజా, వెంకటయ్య, జ్యోతి, ప్రిన్సిపల్ స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.