జమ్మికుంట హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు

జమ్మికుంట హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు

ముద్ర, జమ్మికుంట: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి సోమవారం జమ్మికుంట లోని విజయసాయి హాస్పిటల్, సప్తగిరి హాస్పటల్ లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు.   ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ( పి సి పి న్ డి టి) చట్టం, 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు నిర్వహిస్తున్నారని జమ్మికుంట మండల మెజిస్ట్రేట్ ఎమ్మార్వో సమక్షంలో విజయ సాయి హాస్పిటల్లోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ ను సీజ్ చేయడం జరిగింది.

అలాగే మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజేశ్వరి , పట్టణ సిఐ రమేష్, డాక్టర్ వినీత,పి ఓ ఎం సి హెచ్ , రంగారెడ్డి డెమో  తదితరులు పాల్గొన్నారు.