మార్పు మన నుంచే ప్రారంభించుకోవాలి

మార్పు మన నుంచే ప్రారంభించుకోవాలి

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎం శ్వేతా రెడ్డి పిలుపు

సిద్దిపేట :ముద్ర ప్రతినిధి:  చట్టాలు అన్నింటికీ పరిష్కారం చూపవని, మార్పు మనతోనే ప్రారంభమైతే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతారెడ్డి స్పష్టం చేశారు. మగవారిలో పితృస్వామ్య భావజాలం ఉన్నందున దాన్ని అదుపులోకి తెచ్చుకొని, అవగాహన పెంచుకొని లింగ బేధం చూపకుండా అందరిని సమానంగా గౌరవించాలని సిపి పిలుపునిచ్చారు. జండర్ సెన్సిటైజేషన్ ఫర్ యూత్  పై సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో రెండు రోజుల పాటు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో 60 మంది  అబ్బాయిలకు వర్క్ షాప్ నిర్వహించారు.  శనివారం సాయంత్రం జరిగిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతారెడ్డి హాజరైనారు. రెండు రోజులపాటు శిక్షణలో పాల్గొన్న బాలురకు సర్టిఫికెట్లను సిపి అందజేశారు. ఈ సందర్భంగా కౌమార బాలురనుద్దేశించి సిపి శ్వేతా రెడ్డి మాట్లాడారు.

ఆడ మగ తేడా లేకుండా మగవారి మైండ్ సెట్ మారాలని సూచించారు. జండర్ తేడా లేకుండా లింగ వివక్ష చూపకుండా ముందుకు వెళితే సమాజ శ్రేయస్సు, దేశ అభివృద్ధి ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. వ్యక్తిగతంగా మనిషి మారినప్పుడు కుటుంబం, సమాజం మారుతుందని తెలిపారు.మనిషిలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 60 మంది యూత్ పిల్లలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని, చట్టాలకు సంబంధించిన మెటీరియల్ అందజేయడం జరిగిందన్నారు. వారు వారి గ్రామాలలో, పట్టణాలలో ప్రజలకు, యూత్ పిల్లలకు, ఫోక్సో,మహిళల రక్షణకు ఉన్న చట్టాల అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత భేదాలకు అతీతంగా  అందరూ సమానమేనని, మన ప్రవర్తన కూడా అలానే ఉండాలని సిపి సూచించారు. మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతోపాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.

బాధ్యతాయుతమైన పౌరునిగా మెలగడానికి మనిషికి ఉండవలసిన లక్షణాలు  మానవత్వంగా మెలగడం,నిజాయితీ నిష్పక్షపాతంగా క్రమశిక్షణ ఉంటూ తాను అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం మంచి పనులు చేయడానికి మాత్రమే ముందుండడం ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం నమ్మకాలను పెంపొందించుకోవడంలో ధైర్యంగా ఉండడం బాధ్యతాయుతమైన భావాలను కలిగి ఉండడం సమాజ కోసం పాటుపడే ఒక వ్యక్తి వ్యక్తిలా ఉండడం అంశాల గురించి వివరించారు. ఆడ మగ అని తేడా లేకుండా సమానత్వంగా చూసినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు దేశ అభివృద్ధికి ఇరువురు సమానంగా పనిచేస్తున్నారని  సమాజంలో జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ ఉండాలని తెలిపారు  దీని గురించి మనమందరం సమన్వయంతో పని చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు.

స్వార్డ్  స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి మాట్లాడుతూ
 వివిధ గ్రామాల నుండి సెలెక్ట్ చేసిన యువకులకు 60 మందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్  చట్టాలకు సంబంధించిన బుక్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన ద్వారా సమాజంలో మార్పు రావాలని దానికి అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడ మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని, నేటి తరం స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు. మనిషిపై నమ్మకం చాలా ముఖ్యమని  మరియు సమాజంలో ఉన్న సామాజిక సామాజిక  రుక్మతుల గురించి తెలిపారు. ఆడ మగ అని తేడా లేకుండా సమాజంలో సమన్యాయం ఉండాలని సమాజం అప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు మనిషిలో మార్పు చాలా ముఖ్యమన్నారు  మైండ్ సెట్ మారితే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. సెక్స్, జెండర్ ఏ పదాల్లోకి వస్తాయో వివరించారు. సెక్స్ ప్రకృతి, సైన్స్ నుండి వచ్చిందని, జెండర్ సమాజం నుండి వచ్చిందని తెలిపారు. జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ  గురించి  ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు.

సెక్స్, జెండర్, ఈక్వాలిటీ,ఈక్విటీ జెండర్ బేస్డ్ వైలేషన్స్, కౌన్సిలింగ్,  సూటేబులిటీ డెవలప్మెంట్ గోల్స్,  రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ పర్సన్స్,  తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుజాత రాజ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ శిక్షణా తరగతులలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా, లెక్చరర్ డాక్టర్ సువర్ణాదేవి, కే సుశీల, శంకర్,వసంత ,సూర్య ప్రభ, సుష్మ, స్వరూప, లావణ్య తదితరులు పాల్గొని మాట్లాడారు.