నేటి నుంచి సిద్ధిపేటలో రైలు కూత

నేటి నుంచి సిద్ధిపేటలో రైలు కూత
  • సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ ట్రైన్ 
  • రోజుకు రెండు ట్రిప్పులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సిద్ధిపేట ప్రాంత ప్రజల రైల్వే లైన్ కల నేడు నెరవేరనుంది. సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ ట్రైన్ ప్రారంభం కానుంది. మంగళవారం సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు ఈ రైలును ప్రారంభించనున్నారు. రోజుకు రెండు ట్రిప్పులు చొప్పున ఈ రైలు నడవనుంది. ఈ  రైలు సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్ కు వారంలో 6 రోజులు రెండు ట్రిప్పులు రైలు నడవనుంది. సిద్దిపేట వద్ద ప్రారంభమైన రైలు దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, బేగంపేట్ హాల్ట్, నాచారం, మనోహరాబాద్ జంక్షన్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, బొల్లారం, అశ్వికదళ బ్యారక్స్, మల్కాజ్ గిరి స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్ కు చేరనుంది.