ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి

ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి

ఎండపల్లి ,ముద్ర; ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని పాతగూడూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం పల్లె దవాఖాన ఇంఛార్జి రవీనా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. యుక్త వయసు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎయిడ్స్ సోకిన వారిని చులకనగా చూడవద్దని, వారి పట్ల వివక్ష చూపరాదని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ఏమైనా అనుమానం ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సహజీవనం, కలిసి ఉండటం, కలిసి భుజించడం వలన వ్యాధి రాదని, రక్త మార్పిడి, సూదులు, లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్ హెచ్.పి రవీనా, ఏ.ఎన్.ఎం జి, లక్ష్మి, జి, వరలక్ష్మీ, ఆశ వర్కర్ స్వప్న, కృష్ణవేణి పాల్గొన్నారు.