వాల్తేరు వీరయ్య పబ్లిక్ టాక్...

వాల్తేరు వీరయ్య పబ్లిక్ టాక్...
Waltheru Veeraiya

మెగాస్టార్ చిరంజీవి.. సినిమా అంటే చాలు కేవలం అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులందరికీ పూనకాలే. గత ఏడాది'ఆచార్య'తో.. దసరాకు 'గాడ్ ఫాదర్'తో ప్రేక్షకులను పలకరించారు. కానీ అందులో ఒకటి డిజాస్టర్ అయితే.. ఇంకోటి యావరేజ్ అనిపించుకుంది. మరి ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాలన్న లక్ష్యంతో 'వాల్తేరు వీరయ్య'గా బరిలోకి దిగారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తు న్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి పలువురు సినీ సెలబ్రెటీస్ మూవీని చూశారు. డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, చిరంజీవి కూతుర్లు, మనవరాళ్లు, డైరెక్టర్ మెహర్ రమేష్ వాల్తేర్ వీరయ్య మొదటి షోను చూశారు. ఇక పబ్లిక్ విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య కామెడీ టైమింగ్ ను రీక్రియేట్ చేయడానికి బాబీ అండ్ టీం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలితాన్నిచ్చిందనే చెప్పాలి. మెగాస్టార్ అభిమానులైతే ఆయన పాత్రతో బాగానే కనెక్టవుతారు. మరీ 'హై' ఇచ్చే ఎపిసోడ్లు లేకపోయినా.. సగటు ప్రేక్షకులు ఆశించే మినిమం గ్యారెంటీ వినోదానికి 'వాల్తేరు వీరయ్య'లో ఢోకాలేదు. ఒక పెద్ద స్టార్ నుంచి ఆశించే కమర్షియల్ అంశాలకు ఇందులో లోటు లేదు. బాబీ చిరు మీద అభిమానాన్ని చాటుకుంటూ.. వింటేజ్ మెగాస్టార్ ను గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో విజయవంతం అయ్యాడు.