జలకన్యలా రుహాని

జలకన్యలా రుహాని


రుహాని శర్మ  ఈ బాలీవుడ్​ బ్యూటీ చిలసౌ చిత్రంతో టాలీవుడ్​లోకి  అడుగుపెట్టింది.  హిట్ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తరువాత తెలుగులో నూటొక్క జిల్లాల అందగాడు, డర్టీ హరి సినిమాలలో నటించింది. ఈ మూవీస్ పెద్దగా ఆమెకి ప్లస్ కాలేదు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది.  అలాగే హిందీలో ఆగ్రా అనే మూవీ చేస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే పాయిజన్, మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. సినిమాలలో ఈ బ్యూటీ ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే కనిపించింది. అయితే బయట మాత్రం అల్ట్రా మోడరన్ గా కుర్రకారు మతిపోగొట్టే అందాలతో గ్లామర్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన హాట్ ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా ఆమె ఇచ్చే అప్డేట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా కాఫీ కలర్ లాంగ్ కటింగ్ ఫ్రాక్ లో సముద్ర తీరంలో ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ షోకేస్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తున్నాయి.