భారత్ నేమ్ ప్లేట్ వెనుక కూర్చున్న ప్రధాని మోడీ

భారత్ నేమ్ ప్లేట్ వెనుక కూర్చున్న ప్రధాని మోడీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : జీ 20 సదస్సులో  భారత్  పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ వెనుక కూర్చొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోపన్యాసం చేయడం చర్చానీయంశంగా మారింది. మూడునాలుగు రోజులుగా ఇండియా కాకుండా భారత్ గా దేశం పేరు మార్చుతున్నట్లు తీవ్రంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారికంగా భారత్ నేమ్ ప్లేట్ వెనుకాల ప్రధాని మోడీ కూర్చున్నారు. భారత్ పేరు ప్రదర్శించేలా ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.