సీనియర్​ జడ్జితో విచారణ.. రైలు ప్రమాదంపై సుప్రీంలో పిల్​

సీనియర్​ జడ్జితో విచారణ..  రైలు ప్రమాదంపై సుప్రీంలో పిల్​

న్యూఢిల్లీ: ఒడిశా బాలేశ్వర్​లో చోటుచేసుకున్న రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్​జడ్జిచేత విచారణ జరపాలని పిటిషన్​ దాఖలైంది. జడ్జి ఆధ్వర్యంలో కమిషన్​ ఆఫ్​ ఇంక్వైరీ కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్​ తివారీ పిల్​లో విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో తమ నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. ఈ కమిటీలో సాంకేతిక అంశాలకు సంబంధించిన నిపుణులను కూడా నియమించాలని విశాల్​కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కూడా ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని పిల్​లో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికుల సురక్షితం కోసం ‘కవచ్’ సిస్టమ్​దేశవ్యాప్తంగా ఏర్పాటుకు కూడా ఈ కమిటీ ఓ నిర్ణీత సమయాన్ని విధించాలని, రైల్వే ప్రయాణాలపై ఓ గైడ్​లైన్​ను జారీ చేయాలని విశాల్​ తివారీ తాను దాఖలు చేసిన పిల్​లో కోరారు.