నిద్దురోయే ప్రాంతం..

నిద్దురోయే ప్రాంతం..
  • ఎక్కడపడితే అక్కడే నిద్దురోతారు!

కజకిస్తాన్​: ఆ ప్రాంతంలో నడుస్తూనే నిద్దురలోకి జారుకుంటారు! రోజుల తరబడి లేవరు కూడా లేవరు! అదే కజికిస్థాన్​లోని కలాచీ ప్రాంతం. ఇక్కడి జనాభా 600. ఇందులో 14 శాతం మంది అంటే 84 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2010లోనే వ్యాధిని గుర్తించి చికిత్సలందిస్తున్నా క్రమేణా వ్యాధి వ్యాప్తి ఎక్కువైంది. దీంతో మనిషి నడుస్తూ నడుస్తూనే ఎక్కడపడితే అక్కడే నిద్దురలోకి జారుకుంటాడు. వైద్యనిపుణులు పరిశీలించి ఈ వ్యాధి ‘స్లీప్​హోలో’గా గుర్తించారు. అసలు ఈ వ్యాధి ఎలా వీరికి సంక్రమించిందన్నది ఇప్పటికే మిస్టరీగానే ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం యూరేనియం నిల్వల మైనింగ్​ జరిగేదని శాస్ర్తవేత్తల పరిశోధనలో తేలింది. ఈ ప్రభావం ఏమైనా ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో రేడియేషన్​ ప్రభావం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శాస్ర్తవేత్తలే పేర్కొనడం కూడా గమనార్హమే. ఏది ఏమైనా ప్రపంచంలోని మనుషులు నిద్దురపోయే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కజకిస్తాన్​లోని కలాచీనే అని చెప్పాలి.