ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మూడు రైళ్ల ఢీ  238 మంది మృతి

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం  మూడు రైళ్ల ఢీ   238 మంది మృతి

1000 కి మంత్ వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు

ఒడి శా: ఒడిశాలోని బాలేశ్వరం జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యమైన రీతిలో 237 కు పెరిగింది. సుమారు వెయ్యి మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మొదట చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 7 బోగీలు పట్టాలు తప్పి పక్కన ఉన్న ట్రాక్ మీద ఉన్న గూడ్స్ రైలు మీద పడిపోయాయి. ఆ తర్వాత హౌరా వైపు వెళ్లే యశ్వంతపూర్- హౌరా ఎక్స్ ప్రెస్ వచ్చి ఆ బోగీలను ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గత రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భోగి నుంచి గుట్టలు గుట్టలుగా శవాలను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని ఒడిశాలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రులకు అంబులెన్సులలో తరలిస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రైల్వే శాఖ మంత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ లో 120 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.