గూడ్స్​ను ఢీకొన్న కోరమాండల్

గూడ్స్​ను ఢీకొన్న కోరమాండల్
  • పట్టాలు తప్పిన 7 బోగీలు
  • 50 మంది మృతి
  • 300 మందికి గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

ఒడిశా:  హౌరా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్ ఎక్స్​ప్రెస్ బాలాసోర్ కు​40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్​రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 50 మంది మరణించారని, 300 మంది గాయపడ్డారని సమాచారం అందింది. ప్రమాదంలో  ఏడు బోగీలు పట్టాలు తప్పాయి.  ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ నాయక్ ప్రమాదంపై ఆరా తీశారు. ఆయన రేపు ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది.  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రమాదంపై వ్యక్తం చేశారు.  రైల్వే సిబ్బంది, అధికారులు, రైల్వే పోలీసులు, వైద్య సిబ్బంది 50 అంబులెన్స్ లతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాలాసోర్​ కలెక్టర్​ కూడా ఈ ఘటనలో సహాయక చర్యల సిబ్బందితో సహకరించాలని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.