తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి... కారు ధ్వంసం

తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి... కారు ధ్వంసం

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు.

పులివర్తి నాని పై దాడికి పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను చెదరగొట్టడం లో భాగంగా నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. తనపై దాడి జరగటంతో మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే పులివర్తి నాని బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నానిపై దాడి జరగడంతో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు,యూనివర్సిటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.