టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం

టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం
  • శ్రీకాళహస్తిలో ఉద్రికత్త

శ్రీకాళహస్తి, ముద్ర: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించడంతో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుంటానని ఓ వ్యక్తి రాగా, అతని జేబులో కత్తిని గుర్తించారు సుధీర్ అనుచరులు. కత్తితో దాడికి  దిగక ముందే టీడీపీ శ్రేణులు అతన్ని అడ్డుకున్నాయి. దాడికి యత్నించిన మునికుమార్ వైసీపీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే దమ్ము లేక వైసీపీ ఇలా దాడులకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. శ్రీకాళహస్తి అసెంబ్లీ బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ సాధించాలని మధుసూదన్ రెడ్డి భావిస్తుండగా, ఈసారి ఎలాగైనా శ్రీకాళహస్తిలో తమ జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది.