కొండగట్టులో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు..

కొండగట్టులో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు..
Consecrations going on in Kondagattu

ఘనంగా శ్రీ లక్ష్మీ సహస్రనామ, హనుమాన్ చాలీసా పారాయణము 

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు మూలవిరాట్టుకు పంచామృత అభిషేకము, సహస్రనామార్చన వేదపఠనము, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 5.30 నుంచి రాత్రి వరకు శ్రీ లక్ష్మీ సహస్రనామ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన, ఓడిబియ్యం, తదితర కార్యక్రమాలు వేదమoత్రోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ టి.మారుతి, మాజీ డైరెక్టర్ పోచమల్ల ప్రవీణ్, అర్చకులు, వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.