తాండూరు ప్రజల కష్టుఖాలు తెలిసినవాడు మరోసారి ఆశీర్వదించండి..
- అభివృద్ధిని చూసి ఆదరించండి..
- ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:- తాండూరు ప్రజల కష్టుఖాలు తెలిసినవాడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం 26 వ వార్డులో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఇంటి ఇంటికి తిరిగి మహిళలకు బీఅర్ఎస్ మానిఫెస్టో వివరించారు. కేవలం 2 సవంత్సరాల్లో 1670 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని మరొకసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభా రాణి, మాజీ కౌన్సిలర్ అనురాధ, పరిమళ నాయకులు కుంచం మురళి, అనిత, కోటం ప్రసాద్, చెనబసప్ప, మోటాటి వెంకట్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.