క్రీడలతో బాలల వికాసం

క్రీడలతో బాలల వికాసం
  • మణికొండలో నవ భారత లయన్స్ క్లబ్
  •  ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

హైదరాబాద్: మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్  తెలంగాణ, (MGAT) నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 8, 9 తేదీల్లో మణికొండలోని  అల్కాపూర్ లో క్రికెట్, ఫుట్ బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో  సాధన స్కాలర్స్ అకాడమీ, నియో ఐజీ  స్కూల్స్ జట్లు ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాయి. మాస్టర్ గేమ్స్ అసోసియేషన్,  నవభారత లైన్స్ క్లబ్ చైర్మన్ బి. వినయ్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నవభారత లయన్స్ క్లబ్ జోనల్ చైర్ పర్సన్ గోపాల కృష్ణ,   ఉపాధ్యక్షులు పద్మ కమలాకర్,   సెక్రెటరీ  పి.స్వరూపా రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పిల్లల ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. పిల్లలను ఆటలు ఆడటానికి, ప్రొత్సహిస్తున్న తల్లి దండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆటలతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ బాగా పెరుగుతాయని చెప్పారు. నిర్లక్ష్యం చేయడం వల్ల శారీరక ఆరోగ్యానికి దూరమవుతున్నారన్నారు. గెలుపు ఓటములను సమంగా చూడడం, భావోద్వేగాల నియంత్రణ, క్రీడాస్ఫూర్తి మొదలైనవి ఆటల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని చెప్పారు. అంతరాలు లేని స్నేహం అక్కడి నుండే చిగురిస్తుందన్నారు. ప్రతి రోజూ పిల్లలను ప్రొత్సహిస్తూ ఆటలు ఆడిస్తున్న ఎమ్ జిటి చైర్మన్ వినయ్, ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ రామారావు, భారత్ కుమార్, స్కూల్స్ కెప్టెన్స్ బెల్లం కొండ భార్గవ, శ్రీనివాస్ కు వారు అభినందనలు తెలిపారు. ఈ అసలు ఈ క్రీడా పోటీలలో సాధన ఇన్ ఫీనిటీ ఇంటర్ నేషనల్ స్కూల్, నియో ఐజా స్కూల్, స్కాలర్స్ అకాడమీ స్కూల్ విద్యార్థులు  పాల్గొన్నారు.