పాలకుర్తిలో సోషల్​ వార్​..!

పాలకుర్తిలో సోషల్​ వార్​..!
  • కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్​ పోటాపోటీ ఆందోళనలు
  • భారీగా మోహరించిన పోలీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో :జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్​ లో అధికార బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీల శ్రేణుల మద్య సోషల్​ వార్​ రాజకీయాలను హీటెక్కించింది. సామాజిక మాద్యమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుపై తప్పుడు పోస్టులు పెట్టారంటూ బీఆర్​ఎస్​ శ్రేణులు కాంగ్రెస్​ నేతలు,కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్​ శ్రేణులను అరెస్ట్​ చేశారు. పోలీసులు, బీఆర్​ఎస్​ నేతల తీరుపై మండిపడ్డ కాంగ్రెస్​ కార్యకర్తలు స్ధానిక రాజీవ్​ చౌరస్తాలో ఆందోళన చేశారు. మరోవైపు బీఆర్​ఎస్​ కార్యకర్తలు సైతం అక్కడే ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పాలకుర్తిలో పోలీసులు భారీగా మోహరించా