న్యూ ఇయర్​ జోష్!

 న్యూ ఇయర్​ జోష్!
  • ఆహ్లాదంగా కొత్త సంవత్సర వేడుకలు
  • ఆంక్షల మధ్య సంబురాలు
  • రోడ్లపై యువత కేరింతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే న్యూ ఇయర్​వేడుకలు మొదలయ్యాయి. క్లబ్బులు, పబ్బుల్లో రద్దీ ఏర్పడింది. స్పెషల్​ ప్రొగ్రాంల్లో డీజే స్టెప్పులతో యువత చిందేసింది. నగర శివారులోని పలు ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా ఈవెంట్లు జరిగాయి. ఈసారి పెద్ద ఈవెంట్లు నిర్వహించకున్నా.. కొంతమంది కుటుంబాలతో సహా శివారు ప్రాంతాల్లో ఎంజాయ్​ చేశారు.  కొత్త సంవత్సర వేడుకలపై ఈసారి పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలు, ఔటర్​ రింగ్​రోడ్డు ఏరియాల్లో రద్దీ కనిపించలేదు. రాత్రి 8 గంటల నుంచే పోలీసులు రోడ్లపై చెకింగ్​ మొదలుపెట్టారు. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వాహనదారులను కట్టడి చేశారు. చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. డ్రంకన్​ డ్రైవ్​ టెస్టులు, డ్రగ్స్​ టెస్ట్​లు నిర్వహించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు రద్దీగా మారాయి. ఈ వేడుకల సందర్భంగా అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగాయి.