తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పేదింటి.ఆడపడుచులకు పెద్దన్నగా కెసిఆర్ తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ లోని  వివిధ వార్డ్ లకు సంబంధించిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బి యస్ కేశవ్,చేతుల మీదగా 103. మందికి లబ్ధిదారులకు  చెక్కులను అందజేశారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ...

నేడు తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్. చేస్తున్న ఉద్యమ సమయంలో పేద ప్రజల కష్టాలను తెలుసుకొని ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బందులను తీలుసుకున్న నాయకుడుగా కళ్యాణ లక్ష్మి రూపంలో వారికి అండగా నిలవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలలో ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా,24 గంటల కరెంటు సబ్సిడీ ఫర్టిలైజర్, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అదే విధంగా గ్రామాల అభివృద్ధి కొరకు పల్లె ప్రగతి లో భాగంగా డంపింగ్ యాడ్లు.పల్లె ప్రకృతి వనం. వైకుంఠ ధాములు. రైతు వేదికలు.ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలు పరిశుభ్రంగా.ఉంచడానికి. ఒక టాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో పరిశుద్ధమైన వాతావరణం కల్పించడానికి హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో మొక్కలు నాటడం ఇంట్లో  ఇంటి పక్కల పూల మొక్కలను పెంచడం గ్రామంలో ఎలాంటి అనారోగ్య కారణాలు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెట్లను పెంచడం మంచి ఆక్సిజన్ లభిస్తుంది అని పేర్కొన్నారు.

గతంలో పెళ్లిళ్లు చేయాలంటే పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు పెద్ద సౌకారి, వ్యాపారస్తులతో అప్పులు చేసి  పెళ్ళిళ్ళు చేసేవారు అని పేర్కొన్నారు. ఆ అప్పులు తీర్చలేక ఎన్నో అవమానాలను ఎదుర్కొనే ఇబ్బందులు పడేవారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.  ప్రతి పేద వారి యొక్క కష్టాలు తెలిసిన నాయకుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అనే పథకం ను ప్రవేశపెట్టి ఆడపిల్లలకు అండగా నిలిచి మొదట 50 వేల రూపాయలు అందజేయడం జరిగింది. నేడు లక్షల నూట పదహారు రూపాయలు ఆడపిల్లలకు పెళ్లి కానుక గా అందజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్. ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం. జరుగుతుంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తూ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తూ బంగారు తెలంగాణ కొరకు నిరంతరం కృషి చేస్తూన్న నాయకుడు సీఎం కెసిఆర్ ని ఎమ్మెల్యే తెలిపారు.కెసిఆర్. గురించి తప్పుగా మాట్లాడితే వారిని వెంటనే ఖండించాలి. మీ బీజేపీ పార్టీలో పరిపాలించే ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కసారి ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కెసిఆర్. నాయకుడు మనకు ఉండడం చాలా గర్వకారణం ప్రతిపక్ష నాయకులకు త్వరలోనే తగిన బుద్ధి చెప్పాలి అని తెలిపారు.గద్వాల పట్టణం భవిష్యత్లో అన్ని రంగాలలో అభివృద్ధి వైపు తీర్చిదిద్దుతామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చిన డబ్బులు ఎవరు వృధా చేసుకోవద్దని  అని అన్నారు. 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీనివాసులు, నరహరి గౌడ్, మహేష్ కుమార్, నాగరాజు, శ్రీమాన్ నారాయణ, అరుణ, కోఆప్షన్ మెంబర్, పట్టణ అధ్యక్షులు గోవిందు, బిఆర్ఎస్ నాయకులు నాగులు యాదవ్, రామయ్య శెట్టి, సాయి శ్యాం రెడ్డి, రంజిత్, జనార్దన్ రెడ్డి, రిజ్వాన్, కురుమన్న, కమ్మరి రాము, ధర్మ నాయుడు, వీరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.