మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్స్ (ఫంక్షన్ హాల్) నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్స్ (ఫంక్షన్ హాల్) నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
The MLA inspected the construction work of multi-purpose community halls

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: వచ్చే నెలలో మొదటి విడత ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం నిర్వహిస్తాం.. గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి, మాల్ దొడ్డి, ద్యాగదొడ్డి, నర్సన్ దొడ్డి, చింతరేవుల గ్రామాలలో నిర్మాణిస్తున్న బీసీ, ఎస్సీ, మైనార్టీ లకు సంబంధించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ( ఫంక్షన్ హాల్స్ ) పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా గద్వాల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, సహకారంతో ప్రత్యేక నిధులతో బీసీ, ఎస్టీ, మైనార్టీ  వర్గాలకు సంబంధించిన వారికి వివాహ శుభ కార్యాలయాలు జరుపుకోవడానికి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

గద్వాల నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ జనాభా నిధులను కేటాయించడం జరిగిందని, త్వరలోనే అన్ని సౌకర్యాలు, సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. పేద ప్రజలు వివాహ శుభకార్యాలు జరుపుకోవడానికి త్వరలో అందుబాటులో తీసుకువచ్చేవిధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో కమిటీ హాల్లో నిర్మాణం చేస్తూ అన్ని విధాలుగా గ్రామంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్ గౌడ్, హనుమంతు రెడ్డి, కురుమన్న, అంజి, సాగర్, ఈశ్వర్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.