Rhino Attack: ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Rhino Attack: ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!
Rhino attack on tourists in Delhi Zoo Park

ఎవరికైనా సింహాన్ని గానీ.. ఏనుగును గానీ.. ఖడ్గ మృగాలను దగ్గర నుంచి చూడాలని ఆశ ఉంటుంది. పిల్లలతో జూపార్కులకు వెళ్లి చూస్తొస్తాం. చూడడం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిధి దాటితేనే ముప్పువస్తుంది. ఇలానే ముచ్చటపడిన కొందరు అడవిలోకి సఫారీకి వెళ్లారు. సఫారీలో సరదాగా తిరుగుతూ కనిపించిన జంతువుల్ని ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే ఉన్నట్టుండి కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌పై తిరుగుతుండగా హఠాత్తుగా ఖడ్గ మృగాల  గుంపు ఎదురైంది. ఏమి చేయవు అనుకున్నారో.. ఏమో తెలియదు గానీ అదే పనిగా ఫొటోలు తీసుకుంటూ ముచ్చటపడుతున్నారు. అంతే మరుక్షణంలో సీన్ రివర్స్ అయిపోయింది. నన్నే ఫొటోలు తీస్తార్రా.. మీ సంగతి చూస్తానంటూ ఓ ఖడ్గమృగం ఉరుముకుంటూ మీదకొచ్చింది. అంతే ఈ ఊహించని పరిణామంతో బెంబేలెత్తిపోయిన డ్రైవర్... వ్యాన్‌ ను వేగంగా వెనక్కి పోనిచ్చాడు..

Watch Here: https://twitter.com/i/status/1629511153180082176

ఎక్కడికి పారిపోతార్రా అంటూ అమాంతంగా ఖడ్గమృగం వ్యాన్‌పైకి దూసుకొచ్చింది. కొమ్ముతో వాహనాన్ని ఢీకొట్టగానే ఫల్టీలు కొట్టుకుంటూ కిందపడిపోయింది. దీంతో వాహనం మీద పడటంతో టూరిస్టులు గాయాలతో బయటపడి ఊపరి పీల్చుకున్నారు. వాహనాన్ని ఢీకొట్టి ఖడ్గమృగం అడవిలోకి వెళ్లిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అదే స్పీడ్‌లో పర్యాటకులపై దాడి చేసుంటే ప్రాణాల్లో గాల్లో కలిసిపోయేవి. దీనికి సంబంధించిన వీడియోను Indian Forest Service officer Sushant Nanda ఇండియన్ ఫారెస్ట్  సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. వైల్డ్ లైఫ్ సఫారీల్లో పర్యటిస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియో చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అడవి జంతువుల గోప్యతకు భంగం కలిగించకూడదని హెచ్చరించారు. పైగా ఆత్మరక్షణ లేకుండా ఇలాంటి సఫారీలకు వెళ్లొద్దని సూచించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద కలగకపోవడం సంతోషమని చెప్పుకొచ్చారు. అయినా కూడా అన్ని సందర్భాల్లో ఇలాంటి అదృష్టం ఉండక పోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.