ఏలాంటి పర్మిషన్ లేకుండా కల్తీ కళ్ళు విక్రయిస్తున్నారు

ఏలాంటి పర్మిషన్ లేకుండా కల్తీ కళ్ళు విక్రయిస్తున్నారు

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి :ధరూరు మండలం ఉప్పేరు గ్రామంలో గీత సహకార సంఘంలో సభ్యులుగా ఉండి ఎన్ నరేష్ గౌడ్, ఎన్ తిమ్మప్ప గౌడ్, భగవంతు గౌడ్, ఎన్ రవీందర్ గౌడ్, ఎన్ విజయ్ చందర్ గౌడ్, ఎన్ వెంకటేష్ గౌడ్, నరసింహులు గౌడ్, వీరు అక్రమంగా కలుదుకనలు ఏర్పాటు చేసుకొని చేత్తి కల్లు తయారు చేసి దర్జాగా అమ్ముతున్నారు. వీరిలో ఎవరికి ఈత చెట్టు గీయడానికి కళ్ళు తీయడానికి రాదు ఉప్పెరు ఖమ్మంపాడు, వామనపల్లి, నర్సన్ దొడ్డి, జీర్బండ, గ్రామాలలో అక్రమంగా కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసుకొని చేతి కళ్ళు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారు.

వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ విషయంపై 13_04_2023 నాడు లిఖితపూర్వకంగా వీరు చేస్తున్న అవినీతి అక్రమాలు ఆధారాలతో సహ మీకు ఫిర్యాదు చేశాము అని తెలియజేశారు. ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కొన్ని గ్రామాలలో ప్రజలు చేత్తికల్లు తాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఇది ఇలా కొనసాగితే ప్రజలు గీత కార్మికులను కళ్ళు దుకాణాలపై దాడి చేయడానికి కూడా వెనుకాడరని వారి ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.