ఘనంగా డీకే అరుణమ్మ జన్మదిన వేడుకలు

ఘనంగా డీకే అరుణమ్మ జన్మదిన వేడుకలు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ, జన్మదినం సందర్భంగా ఈ రోజు డికె. బంగ్లా లో భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు

ఈరోజు డీకే బంగ్లాలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ, జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగింది.130 పైగా యూనిట్ల రక్తం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ, మాట్లాడుతూ  కొన్నిసార్లు రక్తం దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు.
రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ఇచ్చే మన రక్తదానం రక్తం ఈరోజు కాకపోయినా మరొక రోజు ఎవరికో ఒకరికి ప్రాణాలు కాపాడాటానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో  పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .