శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గద్వాల పట్టణంలోని కృష్ణావేణి చౌక్ సమీపంలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, హాజరై వారి చేతుల మీదుగా అయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ. కుల, లింగ వివక్షతను తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పులే భావించారన్నారు. అంటరానితనం  బాల్య వివాహాలకు  వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి   అని అన్నారు. మహిళలు చదువుకుంటే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని  విద్యావంతురాలు చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవింద్, కౌన్సిలర్లు మురళి, టీ.శ్రీను, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నరహరి గౌడ్, కృష్ణ మహేష్ పట్టణ ఉపాధ్యక్షులు ధర్మనాయుడు ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, పార్టీ నాయకులు కోటేష్, నాగులు యాదవ్, గంట రమేష్, కురుమన్న, సీతరాములు, భగీరథ వంశీ, వడ్డేకృష్ణ, వీరేష్, రాజు, మహేష్, బి.శంకర్, చిన్న, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.