మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు సాయుదా దళ డి.ఎస్పి ఇమ్మానియేల్

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు సాయుదా దళ డి.ఎస్పి ఇమ్మానియేల్

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : మద్యం తాగి వాహనం నడిపిన వారికీ కౌన్సిలింగ్ ఇస్తున్న సాయుదా దళ డి.ఎస్పి, గద్వాల టౌన్ : మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సాయుదా దళ డి.ఎస్పి ఇమ్మానియేల్, తెలిపారు. గద్వాల జిల్లా ఎస్పీ సృజన, ఆదేశాల మేరకు గద్వాల జిల్లాలోని వివిధ మండలాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 13 మంది కి గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో సాయుదా దళ డి.ఎస్పి ఇమ్మానియేల్, కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయుదా దళ డి.ఎస్పి  మాట్లాడుతూ. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాలసి ఉంటుంది అని తెలియజేసారు.

కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాలకి, విదేశాలకి వెళ్లాల్సి వస్తే ఈ కేసులు అడ్డొస్తాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు అవుతుంది. కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు.వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అయన అన్నారు. ట్రాఫిక్‌ నియమాలులపై నిర్వహించారు.

వాహనం నడిపే వ్యక్తి విధిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్రవాహనం నడిపేసమయంలో హెల్మెట్‌, కారు నడిపేప్పుడు సీట్‌ బెల్ట్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు గురైతే వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వారితోపాటు ఇతరుల జీవితాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనివారిపై కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గద్వాల ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్, ట్రాఫిక్ సిబంది పాల్గొన్నారు.