సిరిసిల్ల పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం

సిరిసిల్ల పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం

ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం లో బిఆర్ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన 'బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం'లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ నర్సింగ రావు , టిఎస్ పిటిడిసి చైర్మన్ గూడూరీ ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రంధాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ముఖ్యఅతిధులుగా హాజరై ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 60 లక్షల పైచిలుకు సభ్యత్వంలను కలిగిన అతి పెద్ద  పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటూ పార్టీని దిన దినాభివృద్ధి చెందిస్తున్నారని అన్నారు.

పార్టీ కార్యకర్త ఎవరైనా అకాల మరణం వల్ల వారి కుటుంబం అనాధలు కాకూడదు అని దాదాపు పార్టీ కార్యకర్తలందరికీ రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమాను అందిస్తున్న మహానేత అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులలో, కార్యకర్తలందరిలో మనమందరం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమే అనే భావనను కలిగిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను, పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులను, అనుబంధ కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులను, వార్డ్ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను ఇలా అందరూ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్న సభ్యులందరిలో స్నేహభావాన్ని, సోదర భావాన్నిపెంపొందించేలా కార్యకర్తలంతా ఒక చోటికి చేరుకొని ఒక పండగ వాతావరణం లో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల పట్ల ప్రజల్లోకి పార్టీని మరింతగా తీసుకు వెళ్ళడానికి చేయవలసిన కార్యచరణ పట్ల పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

అందులో భాగంగా ఈనెల 5వ తేదీన రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ నందు దాదాపు పది వార్డులు అనగా 1,2,3,4,5,6,14,15,16,17 వ వార్డులను కలుపుతూ ఆయా వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరిని కలుపుకొని అన్ని విషయాలపై మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలు 2023 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం మిగతా వార్డులను కూడ ప్రతి వార్డును ఇన్వాల్వ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశాల ద్వారా కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పార్టీ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వారి వారి సలహాలు సూచనలు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, వార్డ్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.