గడప గడపకు కాంగ్రెస్ గుండె గుండెకు కాంగ్రెస్

గడప గడపకు కాంగ్రెస్ గుండె గుండెకు కాంగ్రెస్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : భావి భారత ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆదేశాల మేరకు. ఎ ఐ సిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, కార్యకర్తల సమక్షంలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఇటిక్యాల మండల కేంద్రంలో కొనసాగిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ యాత్రను సాగిస్తున్నారు. 
9 ఏళ్ల దొరల పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు రాలేదని, కరెంట్ బిల్లులు మోత మోదుతుందని, సిలిండర్ ధర ఆకాశానంటిందని, నిత్యవసర సరుకులు అందడం లేదని, పంటకు గిట్టుబాటు ధర రాలేదని ప్రజలు తమ గోడును సంపత్ కుమార్ తో  వెళ్లబుచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కన్యకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ, యాత్రకు దేశంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అవినీతి కుటుంబ పాలన అంతమొందించే సమయం ఆసన్నమైంది, కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది రైతు కష్టాలు తీరబోతున్నాయి.

నిరంకుశ పాలనతో నివ్వరపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారు అలంపూర్ పాలన అవినీతి కమిషన్లతో రాజ్యమేలుతుందని, అక్రమ ఇసుక, మద్యం దందాలతో అధికార పార్టీ నాయకులు అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాత్రతో అలంపూర్ లోని అన్ని మండలాలలో ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలు పడుతున్న సమస్యలను ఇబ్బందులను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ప్రజల ఆదర అభిమానాలతో  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల ఆశయాలను సుసాధ్యం చేస్తామని హామీ ఇస్తూ యాత్రను విజయవంతం చేస్తామన్నారు, ఈ యాత్రతో టీఆర్ఎస్ అవినీతి పాలన అంతమై సోనియమ్మ రాజ్యం అధికారంలోకి వస్తుందని ప్రజలకు భరోసా నింపుతూ యాత్రలో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు, ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు టిఆర్ఎస్ పాలనతో విసుగు చెంది  యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం రావాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, వెంట అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.