ఇఫ్తార్ విందు లో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు  డికె.అరుణమ్మ

ఇఫ్తార్ విందు లో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు  డికె.అరుణమ్మ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రం లో 17 వ వార్డు కౌన్సిలర్  త్యాగరాజు  ఆధ్వర్యంలో పాతహౌసింగ్ బోర్డ్ 2వ రైల్వే గేటు దగ్గర ఫాతిమా మసీదు లో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులకు డీకే అరుణమ్మ, ఖర్జూర పండ్లు ఇచ్చి దీక్ష ను విరమింపజేశారు.

ఈ సందర్భంగా డికె. అరుణమ్మ. మాట్లాడుతూ:

రంజాన్ మాసంలో ముస్లింలు నెల మొత్తం ఉపవాస దీక్షలు ప్రత్యేక నమాజ్ లు చేస్తూ భక్తిశ్రద్ధలతో రంజాన్ మాసం ను జరుపుకుంటారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన సంక్షేమ పథకాలు అమలు చేసిందనిపేర్కొన్నారు. ముస్లిం ల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు.దేశ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకటరాములు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్, బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి నాగేందర్ యదవ్, శ్రీనివాస్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు తుమ్మల నరసింహులు, గీత రెడ్డి, మోహన్, బాలరంగ  ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు