రైతులకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది - రాపోలు నవీన్ కుమార్

రైతులకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది - రాపోలు నవీన్ కుమార్

ముద్ర నేరేడుచర్ల: స్థానిక నేరేడుచర్ల కేంద్రం నందు బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో SBI బ్యాంక్ మేనేజర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాలను మాఫీ చేసినట్టు ప్రకటించినప్పటికీ బ్యాంకు వాళ్లు వడ్డీ కిందనే జమ చేసుకొని డబ్బు తిరిగి ఇవ్వని పరిస్థితి, ప్రభుత్వము 2014 నుండి 18 సంవత్సరం లోపల అప్పు తీసుకున్న వారికి రుణమాఫీ ప్రకటించినది కానీ, 2014 నుంచి తీసుకున్న అప్పు వడ్డీ కింద సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకొని అప్పు ఇచ్చి మళ్లీ వాల్లె జమ చేసుకున్న పరిస్థితి, నేడు ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ ప్రకటించిన తర్వాత మళ్లీ కొత్త రుణాలు తీసుకోమని ప్రభుత్వం సందేశం ఇచ్చినా కానీ బ్యాంకు వారు కొత్త పంట రుణాలు ఇవ్వని పరిస్థితి అనేక కొర్రీలు పెట్టి మీరు రెగ్యులర్ గా వడ్డీ కట్టలేదని మీకు మీకు ఎకరానికొక్కంటికీ 70000 ఇవ్వమని ఏదో 25000‌నుండి 30000 ఇస్తామని బ్యాంకు వారు అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇట్టి విషయాన్ని ప్రభుత్వం, బ్యాంక్ వాళ్ళు పరిశీలించి రైతులకు వెంటనే కొత్త రుణాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలనీ కోరారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర రామస్వామి, మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున కొంతమంది రైతులు పాల్గొన్నారు