దొంగతనం కేసు చేదించిన సూర్యాపేట జిల్లా పోలీసులు

దొంగతనం కేసు చేదించిన సూర్యాపేట జిల్లా పోలీసులు
  • చివ్వేంల మండలం తిమ్మాపురం గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు
  • కేసు నమోదు చేసి 13 తులాల బంగారం, రూ.3.8 లక్షలు స్వాధీనం చేసుకున్న చివ్వేంల పోలీసులు
  • జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన ఎస్పీ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: 2022 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీన తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు కనకారెడ్డి ఇంటికి తాళం పెట్టి సూర్యాపేట లోని హాస్పటల్ కు వెళ్లగా అదును చూసి దొంగలు తాళం పగలగొట్టి నగదు రూ. 7,50,000/- లు మరియు 13 తులాల బంగారు వస్తువులు దొంగలించారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. దర్యాప్తులో భాగంగా సెల్ టవర్ డంప్ లు పరిశీలించడం, అనుమానితులను విచారణ చేయడం జరిగినది అని ఎస్పీ గారు తెలిపినారు.

దొంగతనానికి గురైన ఆభరణాలు :
1). 4 తులాల ఒక చంద్ర హారం, 2). 3 తులాల చంద్ర హారం, 3). 2 తులాల నక్లెస్, 4). ఒక తులం చంప చరాలు, 5). రెండు ఛైను లు ఒక్కొక్కటి ఒక తులం బరువు గలవి మరియు 6). 3 ఉంగరాలు. 
  ఈ రోజు అనగా  తేదీ  12.05.2023  రోజున  దురాజుపల్లి x రోడ్ యందు  వాహనముల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆటొ యందు వెళుతున్న పెనపహడ్ మండలం మహమ్మాదాపురం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి నాగేశవరరావు, అంగోతు నాగరాజు అనే ఇద్దరినీ  పట్టుబడి చేసి విచారణ చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకాశం జిల్లాకు చెందిన సయ్యద్ అల్తాఫ్ అనే వ్యక్తితో కలిసి ముగ్గురు టీమ్ గా ఏర్పడి తిమ్మాపురం గ్రామంలో బాధితుని ఇంట్లో దొంగతనం  చేసినట్లు ఒప్పుకున్నారు.  
 
నిందితుల వివరాలు:
 1. ఖమ్మంపాటి నాగేశ్వర్ రావు, వ. 31 సం.లు, కులం: చాకలి, వృత్తి: ఆటో డ్రైవర్ R/o మహమ్మదాపురం, పెన్ పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
2. అంగోతు నాగరాజు తండ్రి, వయస్సు : 31 సం.లు, కులము లంబాడ వృత్తి : డ్రైవర్       R/o లాల్ సింగ్ తండా H/o మహమ్మదాపురం, పెన్ పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
3. సయ్యద్ ఆల్థాఫ్ @ఆఫ్రోజ్@ నాజర్ @అప్పు @నజీర్  తండ్రి ఖుద్దుస్  బక్షి , వయస్సు : 40 సం.లు , నివాసము : నవ పేట , చీర్ల , ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ( పరారీలో యున్నాడు ) 

సీజ్  చేసినవి : నగదు : రూ. 3,80,000/- 
బంగారు అభరణములు 1). ఒక చంద్ర హారం 39.260 గ్రాముల బరువు, 2). రెండవ చంద్ర హారం  25.150 గ్రాముల బరువు, 3). నక్లెస్ 16.660 గ్రాముల బరువు, 4). ఒక చైన్ 16.310 గ్రాముల బరువు, 5). రెండవ చైన్ 9.750 గ్రాముల బరువు, 6). ఒక జత చెంప స్వరాలు 07.367 గ్రాముల బరువు  మరియు 7). మూడు ఉంగరాలు కలిపి 9.810 గ్రాముల బరువు కలవు మొత్తం బరువు  : 124.307 గ్రాములు ఒక ఆటొ :  AP-16TD-7423 ( వీరు ముగ్గురు పాత నేరస్తులు ). కమ్మంపాటి నాగేశ్వర్ రావు పై గతంలో సూర్యపేట్ రూరల్, సూర్యపేట్ టౌన్,  పెన్ పహాడ్, చివ్వెంల, కనగల్, మోతె, వనస్థలి పురం పరిధిలో మొత్తం 16 కేసులు నమోదైనాయి,  అంగోతు నాగరాజు  పై  జనగాం, భద్రాచలం, ఘట్ కేసర్, మిర్యాలగూడ, ఖమ్మం, నల్లగొండ , సూర్యపేట్ టౌన్, గోల్కొండ పరిధిలో మొత్తం 11 కేసులు నమోదు అయినాయి.

సయ్యద్ ఆల్థాఫ్ @ఆఫ్రోజ్@ నాజర్ @అప్పు @నజీర్ , వయస్సు : 40 సం.లు , నివాసము : నవ పేట , చీర్ల , ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ( పరారీలో యున్నాడు ). కేసు ను ఛాలెంజ్ గా తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి సూచనలు చేసిన DSP నాగభూషణం, CI సోమ్ నారాయణ్ సింగ్ లను, కేసు చేసినలో నిర్విరామంగా పని చేసిన SI విష్ణు మూర్తి, మధు లను, సిబ్బంది ఇరుగు బాబు, సోమయ్య, లింగయ్య, కర్ణాకర్, కృష్ణ, సైదులు, నిరంజన్ లని  ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో DSP నాగభూషణం, సూర్యాపేట రూరల్ సిఐ సోమ్ నారాయణ్ సింగ్, SI లు విష్ణుమూర్తి, మధు, సిబ్బంది ఉన్నారు.