ఇన్ స్పైర్ మనాక్ ఆప్ పై డిఈఒ అవగాహన

ఇన్ స్పైర్ మనాక్ ఆప్ పై డిఈఒ అవగాహన

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇన్ స్పైర్ మనాక్ ఆప్ ద్వారా స్టూడెంట్స్ నామినేషన్ లను అప్లోడ్ చేసే విధానంపై మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇన్ స్పైర్ ఇంచార్జి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి ప్రొ.రాధా కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించే విధంగా ప్రోత్సహించాలని, తద్వారా నూతన ఆవిష్కరణలను తయారు చేసి భావి శాస్త్రవేత్తలుగా తయారవుతారన్నారు.

ఇందులో భాగంగా పాఠశాలల్లో ఐడియా కాంపిటేషన్ బాక్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. అందులోనుండి ఉత్తమమైన 5 ప్రాజెక్టులను ఇన్ స్పైర్ వెబ్సైట్ లో గాని ఇన్ స్పైర్ మనాక్ ఆఫ్ లో గాని అప్లోడ్ చేయాలని తెలిపారరు. చివరి తేదీ ఆగస్టు 31 వరకు వేచి చూడకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ పాఠశాలల ఇన్ స్పైర్ ఇంచార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.