వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా

వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా

ముద్ర ప్రతినిధి, వనపర్తి :వనపర్తి మున్సిపల్ కౌన్సిల్లో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. చైర్మన్ వైస్ చైర్మన్ లపై గత కొంతకాలంగా అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంతృప్తితో ఉండడం, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అనేకసార్లు వాళ్లు వినతి పత్రం అందజేసినప్పటికీ వారిని మార్చకపోవడంతో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.

దీంతో అనేక పర్యాయాలు టిఆర్ఎస్ కౌన్సిలర్లతో సమావేశమైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నచ్చజెప్పడానికి చూసినప్పటికీ వారు ససిమిరా అనడంతో నాయకులు కేటీఆర్ తో కూడా సమావేశం ఏర్పాటు చేయించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వినకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సహకారం తీసుకుని అయినా చైర్మన్ వైస్ చైర్మన్ లను పడగొడతామని హెచ్చరించడంతో దిగివచ్చిన టిఆర్ఎస్ అధిష్టానం చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లతో రాజీనామా చేయించినట్లు తెలుస్తుంది. ఏడాది పాలన కూడా లేని మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ లు ఎవరు ఎంపిక అవుతారు అన్నది వేచి చూడాలి. టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడం, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో కష్టాల్లో ఉన్న టిఆర్ఎస్ కు డిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పేరుతో కొత్త కుంపటి తేవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కొత్త చైర్మన్ కోసం నువ్విల్లురుతున్న కొందరు కౌన్సిలర్లు తోటి కౌన్సిలర్లకు డబ్బు వెదజల్లే పనిలో పడినట్లు తెలుస్తుంది. కౌన్సిలర్లు డబ్బుకు లొంగి డబ్బున్న వ్యక్తిని చైర్మన్ గా చేస్తారా లేక నిజాయితీపరున్ని ఎన్నుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా అనేక ఒత్తిడిల కారణంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకటించి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ కౌన్సిలర్ల నిర్ణయం మేరకు మరొకరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పాము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ వైస్ చైర్మన్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 4ఏండ్ల 4మాసాలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారముతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశామని అన్నారు. సహకరించిన పార్టీకి, కౌన్సిలర్లకు , అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కురుమూర్తి యాదవ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, సయ్యద్ జామీల్ . కౌన్సిలర్స్ లక్ష్మినారాయణ, మహేష్, పాకనాటి కృష్ణ, నాగన్న యాదవ్, బాషా నాయక్, నాయకులు ఉంగ్లము. తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, షరవంద, స్టార్.రహీమ్, L.I.C కృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.